Current Affairs Telugu Daily

లంకావీ పోర్టుకు చేరుకున్న ‘ఐఎన్‌ఎస్‌ కద్మత్‌’
లంకావీ ఇంటర్నేషనల్‌ మారీటైమ్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఎగ్జిబిషన్‌–2019లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ మలేషియా చేరుకుంది. లంకావీ పోర్టుకు  చేరుకున్న కద్మత్‌కు ఆ దేశ నౌకాదళం ఘన స్వాగతం పలికింది.
వరుసగా 15వ సంవత్సరం లీమా ప్రదర్శనను మలేషియా నౌకాదళం నిర్వహిస్తోంది. ఏడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనలో భాగంగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ కూడా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
29 నౌకాదళాలకు చెందిన నౌకలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు నౌకాదళ విన్యాసాలు, యుద్ధ విమానాల ప్రదర్శనలు, ఆయా దేశాలకు చెందిన యుద్ధ నౌకల సందర్శన, నౌకాదళ కార్యకలాపాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి.

views: 817

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams