Current Affairs Telugu Daily

120 సమస్యాత్మక స్థానాల గుర్తింపు
సార్వత్రిక ఎన్నికల్లో అక్రమంగా నగదు ప్రవాహం, ప్రలోభాల కట్టడికి కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమించనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఎన్నికల ఖర్చు పెడుతున్న సమస్యాత్మకమైన 120 నియోజకవర్గాలను గుర్తించింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, హరియాణా, గుజరాత్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, తదితర రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి.
*అత్యధిక వ్యయం, అక్రమ పద్ధతులు ఎక్కువగా జరిగే నియోజకవర్గాలను ఈ విభాగం కిందకు తీసుకువస్తోంది. ఆయా స్థానాల్లో ఇద్దరు సహాయ వ్యయ పరిశీలకులతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, వీడియోతో కూడిన నిఘా బృందాలను నియమిస్తోందని ఈసీ  తెలిపారు.   ఎన్నికల్లో నల్లధనం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, తాయిలాలతో ప్రలోభాలకు గురి చేయడం వంటి అక్రమాలను అరికట్టడానికి ఇప్పటికే 800 మంది వ్యయ పరిశీలకులను ఈసీ పంపింది. 
* ప్రెసెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ మెంబర్స్  - సునీల్ అరోరా , అశోక్ లరసా , సుశీల్ చంద్ర 

views: 707



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams