Current Affairs Telugu Daily

రక్షణ ఒప్పందాల్లో రూ.850 కోట్లు పోగేసుకున్న న్యాయవాది ఖైతాన్‌
రక్షణ ఒప్పందాల ద్వారా దిల్లీకి చెందిన న్యాయవాది గౌతం ఖైతాన్‌ రూ.850 కోట్లు వెనకేసుకున్నారని ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరోపించింది. వీవీఐపీల కోసం ఉద్దేశించిన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలోనూ ఆయనకు ప్రమేయం ఉందని  ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనపై అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కోర్టులో అభియోగాలు నమోదు చేసినట్టు పేర్కొంది. ఆయనను  అరెస్టు చేయగా, ప్రస్తుతం తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.
views: 662

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams