Current Affairs Telugu Daily

చంద్రయాన్‌-2లో నాసా లేజర్‌ పరికరాలు
చంద్రుడిపై పరిశోధనల కోసం  భారత్‌ ప్రయోగించబోయే చంద్రయాన్‌-2 వ్యోమనౌకలో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన లేజర్‌ పరికరాలు ఉంటాయి. జాబిల్లి భూమికి ఎంత దూరంలో ఉందన్నది అత్యంత కచ్చితత్వంతో నిర్ధరించడానికి అవి సాయపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుడిపై  దిగబోయే ఇజ్రాయెల్‌ ల్యాండర్‌ ‘బెరెషీట్‌’లోనూ నాసాకు చెందిన లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ ఫలకాలు ఉంటాయని చెప్పారు.
‘‘చందమామ ఉపరితలంపై సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో రిఫ్లెక్టర్‌ ఫలకాలను ఉంచాలని భావిస్తున్నట్లు నాసాలోని ప్లానెటరీ సైన్స్‌ డివిజన్‌ తాత్కాలిక డైరెక్టర్‌ లోరీ గ్లేజ్‌ చెప్పారు.
*రెట్రోరెఫ్లెక్టర్లు అనేవి అధునాతన దర్పణాలు. అవి భూమి నుంచి పంపే లేజర్‌ కాంతి సంకేతాలను పరావర్తనం చెందిస్తాయి. చంద్రుడిపై సదరు ల్యాండర్‌ ఎక్కడ ఉందన్నది అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఈ సంకేతాలు వీలు కల్పిస్తాయి. దీని ఆధారంగా చంద్రుడు-భూమి మధ్య దూరాన్ని నిర్దిష్టంగా తేల్చవచ్చు. ఇప్పటికే జాబిల్లిపై ఇలాంటి పరికరాలు ఐదు వరకూ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని లోపాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
*Distance Between Earth And Moon- 3,84,000 KMs 
*LASER  = "Light Amplification by Stimulated Emission of Radiation".

views: 699

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams