Current Affairs Telugu Daily

 పుల్వామా దాడికి వర్చువల్‌ సాంకేతికత, అమెరికా సాయం కోరిన భారత్‌
గ్రవాదులు వర్చువల్‌ సిమ్‌లు వాడటాన్ని దర్యాప్తు సంస్థలు ఊహించలేకపోయాయి. ఈ సిమ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్‌లో ఒక టెలిఫోన్‌ నెంబర్‌ను సృష్టిస్తారు. దీనిని వాడటం కోసం సదరు సర్వీసు ప్రొవైడర్‌ అప్లికేషన్‌ను మన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
*సోషల్‌ మీడియా ఖాతాలతో అనుసంధానిస్తే ఒక వెరిఫికేషన్‌ కోడ్‌ వస్తుంది. దానిని ఆ యాప్‌కు ఇస్తే వర్చువల్‌ సిమ్‌ యాక్టివ్‌ అవుతుంది. దీని నెంబర్లు ‘+1’ రూపంలో వస్తాయి. ఈ తరహా నెంబర్లు అమెరికాలో వాడటం కోసం వినియోగించే ది మొబైల్‌ స్టేషన్‌ ఇంటర్నెషనల్‌ సబ్‌స్క్రైబర్‌ డైరెక్టరీ (ఎంఎస్‌ఐఎస్‌డీఎన్‌)నెంబర్లకు ఉంటాయి.
*దీంతో పుల్వామాలో వాడిన వర్చువల్‌ సిమ్‌ల సమాచారం కోసం భారత్‌ అమెరికా సాయం కోరింది. వీటికి చెల్లింపుల వివరాలను కూడా అడిగింది. 

views: 747

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams