Current Affairs Telugu Daily

ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాల జారీ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) వారికి ధ్రువీకరణ పత్రాల మంజూరు రాష్ట్రంలో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ కింద 10% రిజర్వేషన్‌ కల్పించింది.
*ఈ ప్రయోజనం పొందాలంటే వార్షిక ఆదాయ పరిమితి రూ.8లక్షలలోపు ఉండాలని కేంద్రం నిర్దేశించింది.  దీని ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ధ్రువీకరణపత్రాలు మంజూరుచేయాలని రెవెన్యూశాఖ ఇటీవల జిల్లాలకు ఉత్తర్వులు పంపింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులుచేసింది.
  • EWS (Economically Weaker Section)

views: 968



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams