Current Affairs Telugu Daily

ఈఎంఐశాట్‌ను ప్రయోగించనున్న భారత్‌
 అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ శాటిలైట్‌ (ఈఎంఐశాట్‌)ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో 28 థర్డ్‌పార్టీ శాటిలైట్లూ నింగిలోకి చేరుకోనున్నాయి. ఇవన్నీ దేశ,విదేశాలకు చెందిన పలు సంస్థలవి. దీనికోసం సరికొత్త వేరియంట్‌ పీఎస్‌ఎల్‌వీని ఉపయోగించనున్నారు.
*436 కిలోల ఈఎంఐశాట్‌ను 749 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. వీటిల్లో ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ వ్యవస్థ సముద్రంలోని ఓడలపై నుంచి వచ్చే సందేశాలను రిసీవ్‌ చేసుకోగలదు. దీంతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సాంకేతికతను కూడా వాడుతున్నారు. 
*ఈ రాకెట్‌తో వెళ్లే 28 శాటిలైట్లలో  24 అమెరికావి కాగా 2 లుత్వెనియావి, మరొకటి స్పెయిన్‌, ఇంకోటి స్విట్జర్‌లాండ్‌ నుంచి వచ్చినవి. వీటి బరువు దాదాపు 220 కిలోలు. ఇస్రో దేశ రక్షణ అవసరాల నిమిత్తం జులై లేదా ఆగస్టులో మరో రెండు రక్షణ రంగ శాటిలైట్లను ప్రయోగించనుంది.

views: 736

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams