Current Affairs Telugu Daily

మొజాంబిక్‌లో భారత నౌకాదళం సేవలు
‘ఇదాయ్‌’ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న మొజాంబిక్‌లో భారత నౌకాదళం బృందం తన సేవలను అందించింది. వరదల్లో చిక్కుకున్న మొత్తం 192 మందిని రక్షించింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో 1381 మందికి చికిత్స చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఇదాయ్‌’ ధాటికి మొజాంబిక్‌, జింబాబ్వే, మలావీ తీవ్రంగా దెబ్బతిన్నది. 
ఈ నేపథ్యంలో మొజాంబిక్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ఇటీవల భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుజాత, ఐసీజీఎస్‌ సారథి, ఐఎన్‌ఎస్‌ షర్దూల్‌ మొత్తం మూడు నౌకలను బీరా పోర్టుకు తరలించింది. మపుటోలోని హై కమిషన్‌, స్థానిక యంత్రాంగం సహకారాన్ని తీసుకుంది. చేతక్‌ హెలికాప్టర్‌ ద్వారా బాధితులకు ఆహార, నీటి పొట్లాలను జార విడిచింది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏరియల్‌ సర్వేను నిర్వహించింది. ఆ సమాచారాన్ని విపత్తు నివారణ బృందానికి చేరవేయడం ద్వారా బాధితులను రక్షించగలిగింది.

views: 692

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams