Current Affairs Telugu Daily

చివరి దశ పోలింగ్‌ పూర్తయ్యే వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం
ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌ (మే 19 తేదీ) ముగిసిన గంట తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అప్పటి వరకూ టీవీ, రేడియో ఛానళ్లతో పాటు వెబ్‌సైట్లు, కేబుల్‌ నెట్‌వర్క్‌లు, సామాజిక మాధ్యమాలు వాటిని ప్రసారం చేయటం, ప్రదర్శించటం చేయరాదని తెలిపింది.
*ఈ నిబంధనల పరిధిలోకి వెబ్‌సైట్లను, సామాజిక మాధ్యమాలను చేర్చటం ఇదే ప్రథమం. అలాగే ప్రతి దశలోనూ పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఎటువంటి అభిప్రాయాలు, అభ్యర్థనలు తమ ప్రసారాల్లో/ప్రదర్శనల్లో లేకుండా జాగ్రత్తవహించాలని కోరింది.
*ఈ సూచనలు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకూ వర్తిస్తాయని వెల్లడించింది.
**ఆయా మాధ్యమాల్లో జరిగే చర్చలు, విశ్లేషణలు, దృశ్య, శబ్దరూపంలోని వ్యాఖ్యానాలకూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 126ఎ నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams