హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ప్రతిష్ఠాత్మకమైన ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. దీంతో వ్యవసాయ పరిశోధన స్థానాలకు నిలయమైన రాజేంద్రనగర్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కీలక ఒప్పందం కుదిరింది. ఇరి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాథ్యూమోరల్, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు
views: 1017