Current Affairs Telugu Daily

ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ వన్టే ర్యాంకింగ్స్‌లో టాప్‌1ని నిలబెట్టుకున్న మంధానా, జులన్‌ గోస్వామి
ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ వన్టే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్‌ జులన్‌ గోస్వామి అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. ఐసీసీ మర్చి 22న ఆటగాళ్లతో పాటు, జట్ల ర్యాంకులను కూడా ప్రకటించింది.
*గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన స్మృతి తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్‌ పెర్రీ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ అమీ సాటర్త్‌వైట్‌, టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, వెస్టీండీస్‌ కెప్టెన్‌ స్టాఫనీ టేలర్‌ ఉన్నారు.
*బౌలర్ల విభాగంలో టీమిండియా బౌలర్‌ జులన్‌ గోస్వామి మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన జెస్‌ జొన్నాసెన్‌, పాకిస్థాన్‌కు చెందిన సానా మిర్‌, ఆస్ట్రేలియాకు చెందిన మీగన్‌ స్కట్‌, భారత్‌ బౌలర్‌ షికా పాండే తరువాతి ర్యాంకుల్లో ఉన్నారు.  
*ఆల్‌రౌండర్ల విభాగంలో ఇది వరకు టాప్‌ -5 స్థానాల్లో ఉన్నవారు వారి ర్యాంకులను పదిలంగా ఉంచుకున్నారు. ఆస్ట్రేలియాకు ఆల్‌రౌండర్‌ ఎల్లైస్‌ ఫెర్రీ, వెస్టీండీస్‌ క్రీడాకారిణి స్టాఫనీ టేలర్‌, సౌతాఫ్రికా కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నీకార్క్‌, టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, ఇంగ్లండ్‌ క్రీడాకారిణి నటలీ స్కివర్‌ తొలి ఐదు ర్యాంకులను నిలబెట్టుకున్నారు. *ఐసీసీ జట్ల ర్యాంకింగ్‌లో  22 పాయింట్లతో ఆస్ర్టేలియా ప్రథమ స్థానంలో నిలవగా, 18 పాయింట్లతో ఇంగ్లండ్‌, 16 పాయింట్లతో భారత్, 14 పాయింట్లతో న్యూజిలాండ్‌, 13 పాయింట్లతో సౌతాఫ్రికా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి 

views: 1094



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams