Current Affairs Telugu Daily

వీవీప్యాట్‌ల లెక్కింపుపై నివేదిక

వీవీప్యాట్‌లు ఎన్ని లెక్కించాలన్న అంశంపై ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీ కేంద్రం అధిపతి ప్రొఫెసర్‌ అభయ్‌ జి.భట్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడాకు తమ నివేదికను సమర్పించింది.
దేశంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లోని వీవీప్యాట్‌లను లెక్కించి ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చుతున్నారు. అలా కాకుండా కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాలని దేశంలోని ప్రధాన రాజకీయపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈసీ దీనిపై అధ్యయనం చేసి సిఫార్సు చేసే బాధ్యతను ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగించింది. చెన్నై మాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ కె.కరందికర్‌, సెంట్రల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ సోషియల్‌ స్టాటిస్టిక్స్‌ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఓంకార్‌ ప్రసాద్‌ ఘోష్‌ల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం గణాంకాల విభాగంలోని నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని వీవీప్యాట్‌ల లెక్కింపుపై తుది నివేదికను ఈసీకి సమర్పించింది. 


views: 839

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams