Current Affairs Telugu Daily

స్త్రీ నిధి రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
పొదుపు సంఘాల్లోని మహిళలు  సూక్ష్మ రుణ సంస్థ బారిన పడకుండా చూడటం లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ స్త్రీనిధి సంస్థ.. ఇక తాను ఇచ్చే రుణాలపై 13% చొప్పున వార్షిక వడ్డీని వసూలు చేయనుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 13.5 శాతం ఉండగా దీనిలో 0.5 శాతాన్ని తగ్గించాలని సంస్థ పాలక మండలి నిర్ణయించింది. కొత్తరేటు 2017 ఆగస్టు 1వతేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రుణ మంజూరీలో ఈ ఏడాది కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
views: 1115



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams