Current Affairs Telugu Daily

వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి 6.8 శాతం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి అంచనాలను ఫిచ్‌ తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికంటే ఆర్థికాభివృద్ధి జోరు బలహీనంగా ఉండటంతో వృద్ధి అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి కోత వేసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను సైతం 7.2 శాతం నుంచి 6.9 శాతానికి ఫిచ్‌ తగ్గించింది. కేంద్ర గణక కార్యాలయం (సీఎస్‌ఓ) సైతం ఇటీవల వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 2017-18లో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించింది. ఫిచ్‌ గ్లోబల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ ప్రకారం
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 శాతంగా నమోదుకావొచ్చు. ఆపై వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇది 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
* భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. ఏప్రిల్‌-జూన్‌లో 8 శాతంగా నమోదైన జీడీపీ, జులై- సెప్టెంబరులో 7 శాతానికి, అక్టోబరు- డిసెంబరులో 6.6 శాతానికి పరిమితమైంది. వృద్ధి అంచనాలను తగ్గించడానికి తయారీ, వ్యవసాయ రంగాలు నెమ్మదించడమే ప్రధాన కారణం. దేశీయంగా వృద్ధి జోరు గణనీయంగా తగ్గింది.
* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలుపై ఆధారపడ్డ ప్రాంతాల్లో రుణాల లభ్యత కష్టతరంగా మారింది. ఇది ఆటోలు, ద్విచక్రవాహన అమ్మకాలపై ప్రభావం చూపింది.
* ఈ ఏడాది డిసెంబరుకు డాలర్‌తో పోలిస్తే రూపాయి 72 స్థాయికి బలహీనపడొచ్చు. 2020 డిసెంబరుకు ఇది 73కు చేరొచ్చు.
* ఆర్‌బీఐ కీలక రేట్ల కోతపై సానుకూల వైఖరి కనబరుస్తోంది. ఇది వృద్ధి పెరగడానికి దోహదపడొచ్చు. 2019లో మరో పావుశాతం మేర రేట్ల కోత ఉండే అవకాశం ఉంది.
* అంతర్జాతీయ వృద్ధి 2018లో 3.3 శాతం నుంచి 3.2 శాతానికి, 2019లో 3.1 శాతం నుంచి 2.8 శాతానికి పరిమితం కావొచ్చు. చైనా వృద్ధి 2018లో 6.6 శాతం నుంచి 2019లో 6.1 శాతానికి తగ్గొచ్చు
* ఈ ఏడాదిలో బ్యారెల్‌ ముడిచమురు ధరలు 65 డాలర్ల దరిదాపుల్లో కదలాడొచ్చు. 2020లో 62.5 డాలర్లకు చేరే అవకాశం ఉంది.

views: 797



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams