Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సాయం
ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా అండగా నిలుస్తోంది. దాదాపు 2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 
గతంలో పాక్‌కు 6 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన సౌదీ అరేబియా ఇప్పటికే 3 బిలియన్‌ డాలర్లు సమకూర్చింది. మిగిలిన నిధులను సౌదీ నుంచి పాక్‌ దిగుమతి చేసుకునే క్రూడ్‌ ఆయిల్‌లో రాయితీలుగా ఇస్తామని ప్రకటించింది.
2018 నవంబర్‌లో చైనా రాజధాని బీజింగ్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశమైన చైనా ప్రీమియర్‌ లీ కెఖియాంగ్‌ ప్రతినిధులు తాజా నిధుల సమీకరణ కోసం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పాక్‌ను ఆర్థికంగా నిలబెట్టేందుకు నిధులివ్వడమే కాకుండా ఆ దేశంలో పెద్దయెత్తున చైనా పెట్టుబడులు పెట్టి, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయనుందని చైనా కాన్సుల్‌ జనరల్‌ లాంగ్‌ డింగ్‌బిన్‌ ప్రకటించారు. పాకిస్థాన్‌ను కాపాడేందుకు చైనా సహా ఇస్లామిక్‌ దేశాలన్నీ అండగా నిలుస్తున్నాయి. కాని ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాక్‌ విధానాన్ని మాత్రం ఈ దేశాలు తప్పుపట్టక పోవడం గమనార్హం. 
  • China President: Xi Jinping 
  • Capital: Beijing
  • Currency: Renminbi

views: 776



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams