Current Affairs Telugu Daily

ఓటర్లకు సమాచారం ఇచ్చేందుకు ‘1950’ హెల్ప్‌లైన్‌ నంబర్‌ కేటాయించడానికి కారణం 
ఓటర్లకు సమాచారం ఇచ్చేందుకు ‘1950’ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఇప్పుడు ప్రతి జిల్లాలో నడుస్తోంది. అదే నంబర్‌ కేటాయించడానికి కారణం ఏమిటంటే భారత ఎన్నికల సంఘం ఏర్పడింది 1950 జనవరి 25 నాడు. సంఘం ఆవిర్భావ సంవత్సరానికి గుర్తుగా 1950 నంబర్‌తో ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డిస్ట్రిక్ట్‌ కాంటాక్ట్‌ సెంటర్‌ ద్వారా సేవలు అందిస్తున్నారు.
ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే ఓటు గురించి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. 1950 కేంద్రాలు సమాచారం ఇవ్వడం, అభిప్రాయాలు తీసుకోవడం, సలహాలు, ఫిర్యాదుల స్వీకరించడం వంటి నాలుగు విభాగాల్లో ఓటర్లకు సేవలు అందిస్తున్నాయి.

views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams