Current Affairs Telugu Daily

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీజే)కు ఫిర్యాదు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మానవహక్కుల హననానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు మాజీ అధికారులు అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం (ఐసీజే)కు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో జిన్‌పింగ్‌ ప్రభుత్వం అధమమైన చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.
వేలాదిమంది మత్స్యకారులు తమ జీవనభృతిని కోల్పోయారని, పర్యావరణం నాశనమైపోయిందని వాపోయారు.  ఐసీజే ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేశామని ఫిలిప్పీన్స్‌ విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఆల్బర్ట్‌ డెల్‌ రోసారియో, యాంటీగ్రాఫ్ట్‌ ప్రాసిక్యూటర్‌ కొంచి కార్పియో మోరల్స్‌ తెలిపారు. జిన్‌పింగ్‌తో పాటు చైనా అధికారులు ఏడు వివాదాస్పద పగడపు దిబ్బలను ద్వీపాలుగా మార్చారని ఆరోపించారు.
  • China President: Xi Jinping  
  • Capital: Beijing
  • Currency: Renminbi

views: 876



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams