Current Affairs Telugu Daily

105వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం 
105వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ వెబ్‌సైట్‌ను 2017 జులై 5న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎస్‌.రామచంద్రం ప్రారంభించారు. 2018 జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జరుగుతుంది. ఇందులో పాల్గొనబోయే సభ్యులు  ముందుగా సభ్యత్వ నమోదు చేసుకోవాలి. జీవితకాలు సభ్యత్వం కోసం రూ.2,500, వార్షిక సభ్యత్వం రూ.250, విద్యార్థుల వార్షిక సభ్యత్వానికి రూ.100 చొప్పున చెల్లించి నమోదు చేసుకోవాలి.
views: 1059



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams