Current Affairs Telugu Daily

ఫోన్‌ ట్యాపింగ్‌ పిటిషన్‌పై స్పందించండి: హైకోర్టు
ఫోన్ల ట్యాపింగ్‌పై వైకాపా నేతలు దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ సర్కారును దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
తమ ఫోన్లను ట్యాప్‌ చేసి, అక్రమంగా సాంకేతిక నిఘాలో ఉంచారని ఆ నేతలు ఆరోపించారు. వైకాపా మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, మరో ఐదుగురు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. వీరిలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ సహాయకులు ఉన్నారు. తమ ఫోన్లను  ట్యాప్‌ చేయడానికి కారణాలేంటో చెప్పేలా కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు, మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలివ్వాలని కోరారు.
వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సంగీతా ధింగ్రా కేంద్ర టెలికం, హోంశాఖలకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు.

views: 1041



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams