Current Affairs Telugu Daily

రైలు టికెట్లపై మోదీ ఫొటో 
రైలు టికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రం(ఫొటో) ముద్రించటంపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘానికి (ఈసీ) మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ విజయాలను తెలిపే ప్రకటనలో భాగంగా రైలు టికెట్లపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రిస్తున్నారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమేనని ఈసీకి రాసిన లేఖలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఆ తరహా రైలు టికెట్ల ముద్రణ నిలిపివేతకు ఆదేశించాలని ఈసీని కోరింది.
views: 793

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams