Current Affairs Telugu Daily

‘నాసా’ కాంటెస్ట్‌లో విశ్వవిజేతగా నారాయణ పాఠశాలలు
నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌-2019లో ‘నారాయణ’ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ఆ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. సింధూర నారాయణ వెల్లడించారు.
*ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 112 సెలక్షన్స్‌ ప్రకటించగా ఒక్క నారాయణ పాఠశాలల నుంచే 38 శాతం సెలక్షన్స్‌ను సాధించినట్లు తెలిపారు. వరల్డ్‌ నం.1 స్థానంలో 5 సెలక్షన్స్‌, వరల్డ్‌ నం.2 స్థానంలో 7, నం.3 స్థానంలో 5 సెలక్షన్స్‌ నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు చెప్పారు.
*గత 5 సంవత్సరాలుగా నాసా కాంటెస్ట్‌లో ఇదే స్థాయి ఫలితాలను సాధిస్తూ నారాయణ విశ్వవిజేతగా నిరూపించుకుందని పేర్కొన్నారు.
*ప్రపంచంలోనే అత్యధికంగా 175 మంది విద్యార్థులను జూన్‌ 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌కు పంపుతున్న ఘనత తమ విద్యాసంస్థలదేనని వివరించారు. 

views: 809

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams