Current Affairs Telugu Daily

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ కొనసాగింపు
టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ కొనసాగింపు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం త్వరలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌ కోచ్‌గా అతడికి చివరి టోర్నీ.
ఐతే ఆ మెగా టోర్నీ తర్వాత జరిగే వెస్టిండీస్‌ పర్యటనకు కూడా రవిశాస్త్రి, అతడి సహాయ బృందం కొనసాగేలా బీసీసీఐ తాత్కాలిక కాంట్రాక్టు ఇవ్వనున్నట్లు తెలిసింది.
2017లో కుంబ్లే పదవి నుంచి దిగిపోయాక రవిశాస్త్రి టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ అయిన సంగతి తెలిసిందే. గతంలో అతను జట్టు డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ప్రస్తుత జట్టుకు బంగర్‌ బ్యాటింగ్‌, భరత్‌ అరుణ్‌ బౌలింగ్‌, ఆర్‌.శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌లుగా కొనసాగుతున్నారు. ప్రపంచకప్‌ తర్వాత బీసీసీఐ కొత్త కోచ్‌ల నియామకానికి ఇంటర్వ్యూల ప్రకటన ఇవ్వనుంది.

views: 816

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams