Current Affairs Telugu Daily

నా వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడు: దలైలామా
తాను మరణించిన తరువాత తన వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడని టిబెట్‌వాసుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (83) అన్నారు. దలైలామా అస్తమించిన తరువాత కూడా తిరిగి అవతారమెత్తుతారన్నది టిబెట్‌ బౌద్ధుల నమ్మకం. ప్రస్తుత దలైలామా రెండేళ్ల బాలునిగా ఉన్నప్పుడు అంతకుముందున్న 13వ దలైలామా ఆత్మ ఆయనలో ప్రవేశించిందని విశ్వసిస్తారు. ప్రస్తుతం ఉన్నది 14వ దలైలామా కాగా, తన వారసునిగా వచ్చే 15వ దలైలామా ఎవరన్నదానిపై ఆయన ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌లో అవతారమెత్తే బాలుడిని కాకుండా చైనా ప్రభుత్వం వేరే వారిని దలైలామాగా నియమించాలని భావిస్తోందని, అదే జరిగితే ఆయనను ఎవరూ గౌరవించరని చెప్పారు. 
  • ప్రభుత్వ ఆమోద ముద్ర కావాల్సిందే 
దలైలామాకు వారసునిగా వచ్చే వ్యక్తికి చైనా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ స్పష్టం చేశారు. 14వ దలైలామా నియామకం సమయంలో కూడా చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. చక్రవర్తుల కాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోందని అన్నారు.

views: 751

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams