Current Affairs Telugu Daily

అఫ్గాన్‌ చారిత్రక విజయం
అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ జట్టు తన తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అఫ్గాన్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 147 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 29/1తో నాలుగోరోజు, సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అఫ్గాన్‌ జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేసిన రహ్మత్‌ షా (76) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా ఐసానుల్లా (65 నాటౌట్‌) రాణించాడు. ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ కాగా  అఫ్గాన్‌ 314 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 288 పరుగులు సాధించింది
  • Afghanistan Capital: Kabul
  • Currency: Afghan afghani
  • President: Ashraf Ghani

views: 868



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams