Current Affairs Telugu Daily

ఈ నెల 20న అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్నీ ప్రారంభించనున్న గవర్నర్‌ నరసింహన్‌ 
అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రో మార్గానికి ఈ నెల 20న ఉదయం 9.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో పచ్చజెండా ఊపనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను మెట్రో రైళ్లలో ప్రయాణానికి అనుమతించనున్నారు. ఈ మేరకు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి, సీవోవో అనిల్‌కుమార్‌ సైనీ సోమవారం పరిశీలించారు. 
ప్రత్యేకతలివీ.. 
* మధురానగర్‌ స్టేషన్‌ను పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ఇక్కడ ఉన్న రెండెకరాల స్థలంలో మహిళలు, పిల్లల అవసరాలు తీర్చే దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి తరుణి స్టేషన్‌గా నామకరణం చేశారు. 
* మెట్రో స్టేషన్లన్నీ రెండు అంతస్తుల్లో ఉంటే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్‌ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఒకే అంతస్తులో నిర్మించారు. ఫ్లాట్‌ఫాం, కాన్‌కోర్స్‌ లెవల్స్‌ ఒకే అంతస్తులో ఉన్నాయి.  
విడతల వారీగా 
  • 30 కి.మీ. మియాపూర్‌-నాగోల్‌  
  • 2017 నవంబరులో ప్రారంభం 
  • 16 కి.మీ. అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌  
  • 2018 సెప్టెంబరులో అందుబాటులోకి 
  • 10 కి.మీ. అమీర్‌పేట-హైటెక్‌సిటీ  
  • 2019 మార్చి 20న ప్రారంభం

views: 859

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams