Current Affairs Telugu Daily

ఫేస్‌బుక్ ఖాతాను మూసేసిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెస్‌
న్యూజిలాండ్‌లోని మసీదుల్లో కాల్పులకు తెగబడిన నిందితుడు ఆ దాడిని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అసహనం వ్యక్తం చేసిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాను మూసివేశారు. ఈ విషయాన్ని టోనీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
*‘నా ఫేస్‌బుక్‌ ఖాతాను మూసివేశాను. ఇక ట్విటర్‌లో ఉండాలా వద్దా అన్న దాని గురించి కూడా ఆలోచిస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో కొన్ని సార్లు మంచి కన్నా ద్వేషమే ఎక్కువగా కన్పిస్తోంది. ఇతరులతో విషయాలను పంచుకునేందుకు ఫేస్‌బుక్‌ గొప్ప వేదిక  ఉపయోగకరమైనదే.. కానీ, ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తల బెడద నాకూ తప్పలేదు. ఇక న్యూజిలాండ్‌ ఘటన నన్ను ఎంతగానో బాధించింది. 17 నిమిషాల పాటు కాల్పులు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఫేస్‌బుక్‌ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. కేవలం ఆర్థిక విషయాలను మాత్రమే ఆ సంస్థ ఆలోచించకూడదు’ అని టోనీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
*న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని రెండు మసీదుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు . మసీదుల్లోకి చొరబడ్డ నిందితుడు ప్రార్థనల్లో నిమగ్నమైన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడితో ఆగకుండా ఈ ఘటననంతా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతిచెందగా మరో 40 మంది వరకు గాయపడ్దారు. 

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams