Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వంతో ఓలా ఒప్పందం
ప్రముఖ రవాణా సేవా సంస్థ ఓలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ మహానగరంలో స్మార్ట్‌ ట్రాఫిక్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది.
*రోడ్లు, రద్దీ నిర్వహణలో ప్రభుత్వానికి తోడ్పాటుగా డేటాను పంచుకోనుంది. నగరంలోని ట్రాఫిక్‌, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి అండగా నిలిచేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సమక్షంలో ఓలా సంస్థతో ఒప్పందం కుదిరింది.
గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, రోడ్డు మరమ్మతుల బడ్జెట్ ప్రాథమ్యాలను నిర్ణయించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది 

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams