Current Affairs Telugu Daily

నీరవ్‌ మోదీకి అరెస్టు వారెంటు జారీ
భారత్‌లో బ్యాంకులను లూటీచేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది. దీంతో అతడు త్వరలోనే అరెస్టయ్యే అవకాశముంది. ముంబయిలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. 
అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ ఈ నెల 9న లండన్‌లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది. నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడంటూ ఇటీవల అక్కడ ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఓ ఖరీదైన కోటును ధరించిన నీరవ్‌.. అక్కడ ఓ పాత్రికేయుడికి తారసపడటంతో అతడు లండన్‌లో ఉన్నట్టు తెలిసింది. 

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams