Current Affairs Telugu Daily

జర్మనీలో పెద్ద బ్యాంకులు డచ్‌ బ్యాంక్‌, కామర్స్‌ బ్యాంక్‌ విలీనం ద్వారా అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పాటుకు సన్నాహాలు

జర్మనీలో పెద్ద బ్యాంకులు డచ్‌ బ్యాంక్‌, కామర్స్‌ బ్యాంక్‌ విలీనం ద్వారా అతిపెద్ద బ్యాంక్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సేవల్లో జాతీయ ఛాంపియన్‌ను ఆవిష్కరించేందుకు, తమ విలీనం కోసం చర్చలు చేపట్టనున్నట్లు ఇరు బ్యాంకులు ఆదివారం ప్రకటించాయి.
లాభాలు తగ్గిపోతున్న నేపథ్యంలో, విదేశీ సంస్థ చేతుల్లోకి వెళ్లే ప్రమాదాన్ని నివారించడంతో పాటు, జర్మనీ నుంచి ఎగుమతులు చేసే కంపెనీలకు ఆర్థిక సాయం చేసేలా అతిపెద్ద ఆర్థిక సంస్థగా అవతరించాలని ఈ రెండు బ్యాంకులకు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెల్‌ మార్కెల్‌ పలుమార్లు సూచించారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు చేపట్టేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి.

  • ఇవి విలీనమైతే

* ఐరోపాలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా విలీన బ్యాంక్‌ ఉంటుంది.
* ఈ బ్యాంకు ఆస్తులు 2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.140 లక్షల కోట్లు) ఆస్తులుంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్‌ బీఎన్‌పీ పరిబాస్‌కు ఇవి సమీపంలో ఉంటాయి.
* డచ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 16.1 బిలియన్‌ యూరోలు కాగా, కామర్స్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 8.9 బిలియన్‌ యూరోలు.


views: 787

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams