Current Affairs Telugu Daily

ఇరాక్‌లో భారత రాయబార కార్యాలయానికి సీఆర్పీఎఫ్‌ కమాండో రక్షణ
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న తన రాయబార కార్యాలయానికి భద్రత కల్పించేందుకు కమాండో శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్‌ దళాన్ని భారత్‌ మోహరించింది. దాదాపు 45 మంది కమాండోలు అక్కడ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే లిబియా రాజధాని ట్రిపోలిలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సీఆర్పీఎఫ్‌ కమాండోలు రక్షణ కల్పిస్తున్నారు. వీరి వద్ద ఏకే శ్రేణి తుపాకులు, గ్లాక్‌ పిస్టళ్లు, ఉగ్రవాద దాడిని తిప్పికొట్టేందుకు ఇతర అధునాతన ఆయుధాలు ఉన్నాయి.
పోరాటాల్లో చాకచక్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లు, వేగంగా స్పందించే బృందాలు, అంగరక్షకులు, ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించే సుశిక్షిత సిబ్బంది, బాంబుల నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న ‘కోబ్రా’ విభాగం నుంచి వీరిని ఎంపిక చేసి, కఠోర శిక్షణ ఇచ్చారు.  ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళం రక్షణగా ఉంది. నేపాల్‌లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌), శ్రీలంకలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) ఇలాంటి విధులను నిర్వర్తిస్తున్నాయి

views: 701

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams