Current Affairs Telugu Daily

పిల్లల్లో పోషకాహార లోపం తగ్గుముఖం

ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల ఫలితంగా పిల్లల్లో పోషకాహార లోపం (ఎదుగుదల సరిగా లేకపోవడం) భారత్‌లో ఏటా దాదాపు 2 శాతం తగ్గుతున్నట్లు తెలిపారు. ఆరేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 2015-16లో 38.4% ఉండగా 2017-18 నాటికి అది 34.7 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు.
యూనిసెఫ్‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో రెండేళ్లలో 4 శాతం పాయింట్లు తగ్గినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 1.12 లక్షల కుటుంబాల నుంచి సమచారాన్ని సేకరించి ఈ సర్వేను నిర్వహించారు. మహిళల్లో రక్తహీనత (ఎనీమియా) తగ్గడం వంటివి కూడా సర్వేలో గుర్తించినట్లు ఆ అధికారి వివరించారు.

* జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) ప్రకారం.. 2004-05 నాటికి పిల్లల్లో ఎదుగుదల లోపం 48 శాతం ఉండగా అది 2015-16 నాటికి దాదాపు 10% తగ్గింది.
* 2018 మార్చిలో ప్రధాని మోదీ ‘పోషణ్‌ అభియాన్‌’ను ప్రారంభించారు. 2022 నాటికి పోషకాహార లోపాన్ని 25 శాతానికి తగ్గించాలన్నది దీని లక్ష్యం.
* మహిళల్లో రక్తహీనత 2015-16లో 50-60 శాతం మధ్య ఉండగా 2017-18 నాటికి అది 40 శాతానికి తగ్గింది.
* ప్రపంచ పోషకాహార నివేదిక 2018 ప్రకారం పోషకాహారలోపం భారత్‌లో తీవ్రంగా ఉంది. దాదాపు 4.66 కోట్ల మంది పిల్లల్లో ఎదుగుదల లోపం ఉంది. తర్వాతి స్థానాల్లో నైజీరియా (1.39 కోట్లు), పాకిస్థాన్‌ (1.07 కోట్లు)లు ఉన్నాయి.


views: 735

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams