Current Affairs Telugu Daily

మసూద్‌ అజార్‌ సమస్య పరిష్కారమవుతుంది-చైనా రాయబారి హామీ
జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ అంశంపై ఓపిగ్గా ఉందామని, తప్పకుండా ఐరాస అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని భారత అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అజార్ విషయంలో భారత్ ఆశలు ఫలించేలా ఉన్నాయి. భారత్‌ సమస్యను అర్థం చేసుకోగలమని ఇది తర్వలోనే పరిష్కారమవుతుందని చైనా రాయబారి లూవో ఝావోహుయ్ తెలిపారు.
దీనిపై లూవో మాట్లాడుతూ..‘ మసూద్‌ అజార్‌ విషయానికి సంబంధించిన భారత్‌ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. మేం భారత్‌ను నమ్ముతున్నాం. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా చేర్చాలనే అంశం త్వరలోనే పరిష్కారమవుతుంది. సాంకేతిక పరమైన సమస్యల కారణంగానే దీన్ని హోల్డ్‌లో ఉంచాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని తెలిపారు.
‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై మేం ఇప్పటికీ ఐరాస భద్రతామండలి ఆంక్షల కమిటీతో కలిసి పనిచేస్తున్నాం. ఈ విషయంలో భారత్‌కు 14 సభ్యదేశాల మద్దతు ఉంది. హోల్డ్‌లో పెట్టడం అంటే ప్రతిపాదనను అడ్డుకోవడం కాదు. మాకు ఇంకా నమ్మకంగానే ఉంది. ఈ విషయంలో భారత సహనాన్ని ప్రదర్శిస్తుంది. ఉగ్రవాదం పెను సవాల్‌ అని, పాక్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని చైనాకు కూడా తెలుసు. మసూద్‌ అజార్‌ను ఐరాస తప్పకుండా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం’ అని నిన్న భారత అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు ఫిబ్రవరి 27న ఐరాస భద్రతామండలిలో ప్రతిపాదన తీసుకొచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనకు చైనా చివరి గంటల్లో సాంకేతికంగా మోకాలొడ్డింది. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా ప్రతిపాదనను హోల్డ్‌లో పెట్టింది

views: 682

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams