Current Affairs Telugu Daily

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూత

దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్‌ March 17 న పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
పరీకర్‌ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు.
*పరీకర్‌ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
*పరీకర్‌ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడుజాతీయ సంతాప దినంగా ప్రకటించింది.
*తొలి ఐఐటీ సీఎం
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్‌(63) పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్‌ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్‌ సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు
*2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్‌  చేస్తున్న ’వన్‌ ర్యాంక్‌–వన్‌ పెన్షన్‌’ విధానం పరీకర్‌ హయాంలోనే అమల్లోకి వచ్చింది.

views: 709

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams