Current Affairs Telugu Daily

నైజీరియా విద్యార్థినికి 20 స్వర్ణాలు
అంతర్జాతీయ సాంస్కృతిక వినిమయంలో భాగంగా మైసూరు విశ్వవిద్యాలయంలో చదువుతున్న నైజీరియా విద్యార్థిని ఎమెలైఫ్‌ స్టెల్లా చిమేలో 20 స్వర్ణ పతకాలు అందుకున్నారు. March 17 న ఆ విశ్వవిద్యాలయం 99వ స్నాతకోత్సవంలో భాగంగా ఎమ్మెస్సీ రసాయనశాస్త్ర విద్యార్థిని స్టెల్లా చిమేలో 20 స్వర్ణపతకాలతో పాటు ఐదు నగదు పురస్కారాలూ అందుకున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో స్థిరపడాలని స్టెల్లా ఆశిస్తున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఇన్నేసి పతకాలు సాధించటం ఇదే తొలిసారి. సింగపూర్‌కు చెందిన నన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.వి.చౌదరి, మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య హేమంతకుమార్‌ విద్యార్థులకు పట్టాలు అందించారు
  • Nigeria Capital: Abuja Trending
  • Currency: Nigerian naira

views: 708

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams