హెచ్ఐవీ పై కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడి
దేశం మొత్తమ్మీద 2017లో కొత్తగా 87.58 వేల కేసులు నమోదవగా తెలంగాణలో 9,324 ఉన్నాయి.
*తెలంగాణ 11 శాతంతో ముందుండగా బిహార్, పశ్చిమబెంగాల్లది 10శాతం, ఉత్తరప్రదేశ్ది 8, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలది 7శాతం.
*మొత్తం జనాభాలో నమోదైన కేసుల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటే మిజోరాం 2.04 శాతంతో అగ్ర స్థానాన, తెలంగాణ 0.70 శాతంతో నాలుగో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 0.63 శాతంతో ఐదో స్థానంలో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ 0.03 శాతంతో చివరన ఉంది.
*జాతీయ సగటు 0.22 శాతం. అదే ఏడాది ఎయిడ్స్ వ్యాధి కారణంగా 69.11 వేల మంది మృత్యువాతపడ్డారు.
*జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), జాతీయ వైద్య గణాంకాల సంస్థ సంయుక్తంగా రూపొందించిన సాంకేతిక నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా వెల్లడించింది.
*2020 నాటికి హెచ్ఐవీ కేసుల నమోదును 75 శాతం తగ్గించడం, తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ, సిఫిలిస్ సోకడాన్ని పూర్తిగా నిర్మూలించడం, హెచ్ఐవీ బాధితులపై వివక్ష, అపోహలను తొలగించడం లక్ష్యమంటూ ప్రకటించింది.
ఎలా వ్యాపిస్తుంది?
* 94 శాతం లైంగికంగా
* 3.8 శాతం తల్లి నుంచి బిడ్డకు
* 1.5 శాతం స్వజాతి సంపర్కం
* 0.3 శాతం సూదుల ద్వారా
* 0.4 శాతం రక్తం, రక్త ఉత్పత్తుల మార్పిడి ద్వారా
* గతంలో రక్తంలో సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటేనే ‘యాంటీ రిట్రో వైరల్(ఏఆర్టీ)’ ఔషధాలను హెచ్ఐవీ బాధితులకు ఇచ్చేవారు. ఇటీవల మార్చిన విధానంలో హెచ్ఐవీ సోకిందని నిర్ధరించగానే ఏఆర్టీ ఔషధాలను ఇస్తున్నారు. వీటిని వాడుతున్నవారు దేశంలో 1181129 మంది.
* 2017 చివరి నాటికి దేశంలో 21.40 లక్షల మంది ప్రజలు హెచ్ఐవీ సోకినవారున్నారు.
* వీరిలో మహిళలు 9,08,600 మంది.
* 15-49 ఏళ్ల మధ్యవయస్కులు 0.22 శాతం.
* గర్భిణులు 22,677 మంది.
* వీరిలో మహారాష్ట్రలో ఎక్కువమంది ఉండగా, ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2015తో పోల్చితే 2017లో 45-49 ఏళ్ల మధ్యవయస్సు మహిళల్లో హెచ్ఐవీ కేసుల సంఖ్య 0.2 శాతం నుంచి 0.8 శాతానికి పెరిగింది.
views: 870