Current Affairs Telugu Daily

రామజన్మభూమి కమిటీ నుంచి రవిశంకర్‌ను తొలగించాలి
రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించడానికి వీలుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ నుంచి శ్రీ శ్రీ రవిశంకర్‌ను తప్పించాలని ఆధ్యాత్మిక గురువు అధోక్షజానంద్‌ దేవ్‌ తీర్థ మహరాజ్‌ డిమాండ్‌ చేశారు. 
*రామజన్మభూమి కమిటీ: 
దశాబ్దాల కాలంగా న్యాయస్థానంలో నలుగుతూ వస్తోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలనేది కూడా సుప్రీంకోర్టే ఖరారు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది.

views: 709

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams