Current Affairs Telugu Daily

టీఎస్‌ఆర్టీసీకి 4 పురస్కారాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి నాలుగు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ఏటా జాతీయస్థాయిలో అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ)అందించే పురస్కారాలివి. వీటిల్లో భాగంగా 2017-18 సంవత్సరానికి వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు విభాగాల్లో ఆర్టీసీకి ఈ గుర్తింపు వచ్చింది.
వాహన ఉత్పాదకతకు సంబంధించి- హైదరాబాద్‌ నగరంలో వాహనం ఒకరోజు తిరిగిన కిలోమీటర్ల(228.98 నుంచి 238.90)కు మొదటి స్థానం లభించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 396.91 నుంచి 404.43 కిలోమీటర్లతో రెండోస్థానం వచ్చింది. ఇంధన పొదుపుపరంగా గ్రామీణ ప్రాంతంలో, హైదరాబాద్‌ నగరంలోనూ ప్రథమ స్థానాలు వచ్చాయి. ఈ నెల 26వతేదీన దిల్లీలో నిర్వహించే ఏఎస్‌ఆర్టీయూ 63వ వార్షిక సదస్సులో అవార్డులను టీఎస్‌ఆర్టీసీ ఎండీ-ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అందుకుంటారు.

views: 877

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams