గాంధీజీ చదివిన బడిని ప్రదర్శనశాలగా మార్చాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసు
రాజ్‌కోట్‌లో మహాత్మాగాంధీ చదువుకున్న పాఠశాలను ప్రదర్శనశాలగా మార్చాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై గుజరాత్ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 164 సం॥ల నాటి ఆల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాలను ప్రదర్శనశాలగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ బడినే మోహన్‌దాస్ గాంధీ ఉన్నత పాఠశాలగా కూడా పిలుస్తారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేష్ మన్సటా అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గుజరాత్ హైకోర్టు 2017 జులై 5న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
views: 1213