Current Affairs Telugu Daily

కీర్తిలాల్‌ డైరెక్టరు సీమా మెహతాకు నారీశక్తి పురస్కారం
కీర్తిలాల్‌ ఆభరణాల సంస్థ డైరెక్టరు, కథక్‌ నృత్యకారిణి సీమా మెహతా 2018 సంవత్సరానికి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు.
15 ఏళ్లుగా మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తున్నారు. పేద పిల్లలకు, యువతులకు ఆమె కథక్‌ నృత్యాన్ని నేర్పిస్తుంటారు. ఈ పురస్కారాన్ని తన మాతృమూర్తికి అంకితమిస్తున్నానని సీమా మెహతా తెలిపారు.
  • Nari Shakti Reward: 3 lakhs INR
  • First awarded: 1999

views: 768Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams