Current Affairs Telugu Daily

శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత 
మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఊరట లభించింది. 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి అతడిపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అది మరీ కఠినమైన శిక్ష అని చెప్పిన కోర్టు అతడికి ఎంత శిక్ష విధించాలనే దానిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది.
*శిక్షను సమీక్షించే ముందు బీసీసీఐ కమిటీ శ్రీశాంత్‌ వాదనలను వినాలని న్యాయమూర్తులు అశోక్‌ భూషణ్‌, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఐతే స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో అతడు దోషి అని తేల్చడాన్ని మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అదే సమయంలో శ్రీశాంత్‌పై దిల్లీ హైకోర్టులో జరుగుతున్న నేర విచారణపై తమ తీర్పు ప్రభావమేమీ ఉండదని స్పష్టం చేసింది. 

views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams