Current Affairs Telugu Daily

ఏఎల్‌సీలు లేని ఎన్నికలు అరుణాచల్‌లో అసాధ్యం
ఎన్నికలు వస్తే చాలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో ‘ఆక్సిలరీ లేబర్‌ కోర్‌’(ఏఎల్‌సీ)ల నియామకాలు తప్పనిసరౌతాయి. పోర్టర్లుగా కూడా పేర్కొనే ఏఎల్‌సీల వ్యవస్థ ఎప్పుడో బ్రిటిష్‌ కాలం నాటిది. ఎన్నికల సామగ్రిని కొండవాలుల్లో ఉండే జనావాసాలు, అగమ్యగోచరంగా అనిపించే కొండదారులు, కనీసం రోడ్డు సదుపాయం కూడా లేకుండా దుర్బేధ్యంగా ఉండే మారుమూల ప్రాంతాలకు చేర్చడంలో ఏఎల్‌సీల పాత్ర కీలకం. వీరు లేని ఎన్నికల నిర్వహణ పూర్తి అసాధ్యం. నాటిరోజుల్లోనే కాదు ఈనాటికి కూడా ఏఎల్‌సీలు లేకుంటే పోలింగ్‌ నిర్వహణ కుదరదు. ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వీరు వారధుల్లాంటి వారు. బ్రిటిష్‌ కాలం నుంచీ ఏఎల్‌సీలను పూర్తిస్థాయి ఉద్యోగులుగానే నియమించేవారు. అయితే, 1987లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత పరిస్థితి మారింది. వారినిప్పుడు కేవలం తాత్కాలిక ప్రాతిపదికననియమించుకుంటున్నారు.
*ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో ఏఎల్‌సీల అవసరం చాలా ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందచేసే సామగ్రి రవాణాలో కూడా వీరు కీలకం. హెలికాప్టర్లు జారవిడిచే రేషన్‌ సామగ్రిని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉన్న ‘కేంద్ర సేకరణ సంస్థ’(సీపీవో)గోదాములకు వీరే చేరవేస్తారు.
ఈ ఎన్నికల్లో:
గత ఎన్నికల్లో కంటే ఈ దఫా అధికసంఖ్యలో ఏఎల్‌సీలను రంగంలోకి దించనున్నట్లు డిప్యూటీ చీఫ్‌ ఎలక్టొరల్‌ అధికారి లికెన్‌కొయు తెలిపారు. అరుణాచల్‌లో ఎక్కడో మారుమూల ఉండే పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 518గా ఉంది. ఆయా కేంద్రాలు వెళ్లాలంటే కాలినడక తప్ప మరో మార్గం లేదు. వీటిల్లో కొన్నింటిని చేరడానికి కనీసం రెండురోజులైనా నడవాల్సి ఉంటుందని లికెన్‌ కొయు చెప్పారు.
  • ​​​​​​అరుణాచల్ ప్రదేశ్ రాజధాని:ఇటానగర్‌

views: 769



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams