Current Affairs Telugu Daily

అమెరికా వెళ్లే విమానాల్లో లాప్‌టాప్‌లకు అనుమతి
ఎమిరేట్స్‌, టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో అమెరికా వెళ్లే భారత్‌ తదితర దేశాల ప్రయాణికులు ఇక నుంచీ లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తీసుకుని వెళ్లవచ్చు. దుబాయ్‌, ఇస్తాన్‌బుల్‌లతో సహా పది విమానాశ్రయాల నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులు క్యాబిన్‌ బ్యాగేజ్‌గా ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకుని వెళ్లడంపై అమెరికా 2017 మార్చిలో నిషేధం విధించింది. ఇలాంటి నిషేధాలు విధించిన విమానాశ్రయాల్లో అత్యధికం ముస్లిం దేశాలకు చెందినవే ఉన్నాయి. ఇపుడు వాటిని తొలగించడంతో అమెరికా వెళ్లేవారు లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తీసుకుని వెళ్లచ్చునని ఎమిరేట్స్‌ సంస్థ తెలిపింది.
views: 1068



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams