Current Affairs Telugu Daily

12 హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు
వాతావరణ మార్పులకు ప్రభావితమవుతున్న 12 భారతీయ హిమాలయ ప్రాంత(ఐహెచ్‌ఆర్‌) రాష్ట్రాల చిత్రపటాలను ఐఐటీ-గువాహటి, ఐఐటీ- మండి, ఐఐఎస్‌సీ- బెంగళూరు రూపొందించాయి. మర్చి 14న జరిగిన కార్యశాలలో రాష్ట్రస్థాయి అధికారులకు దీనిపై అవగాహన కల్పించాయి. ఐహెచ్‌ఆర్‌ ప్రాంతంలోని 12 రాష్ట్రాలు ఇందుకు మొదటిసారిగా ఉమ్మడి విధానాన్ని అనుసరించి ఈ చిత్రపటాలను తయారుచేయడం విశేషం. రాష్ట్ర, జిల్లాస్థాయిలో మిగతావాటితో పోల్చి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ‘ఐహెచ్‌ఆర్‌’లో ఉష్ణోగ్రత, వర్షపాతం బాగా పెరిగాయని పరిశోధకులు చెబుతున్నారు.
 *భారతీయ హిమాలయ ప్రాంతాల్లో
  1. అసోం
  2. మణిపుర్‌
  3. మేఘాలయ
  4. మిజోరం
  5. నాగాలాండ్‌
  6. త్రిపుర
  7. అరుణాచల్‌ప్రదేశ్‌
  8. సిక్కిం
  9. పశ్చిమబెంగాల్
  10. హిమాచల్‌ప్రదేశ్‌
  11. ఉత్తరాఖండ్‌
  12. జమ్మూకశ్మీరు

views: 736

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams