Current Affairs Telugu Daily

ఫెడరల్‌ జడ్జిగా భారత-అమెరికన్‌ న్యాయవాది నియోమీ రావు ఎంపిక
భారత-అమెరికన్‌ న్యాయవాది నియోమీ రావు శక్తిమంతమైన ఫెడరల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. నియోమీ రావు డీసీ సర్క్యూట్‌ అపీళ్ల కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో శక్తిమంతమైన ధర్మాసనాల్లో ఇది ఒకటి. అమెరికా సుప్రీం కోర్టు తర్వాతి స్థానంలో ఇది ఉంది.
*నియోమీ నియామకాన్ని సెనేట్‌ 53-46 ఓట్లతో ఆమోదించింది. వివాదాస్పద బ్రెట్‌ కవానా స్థానంలో ఆమె నియమితులయ్యారు. నియోమీ ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యవహారాల కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
*అంతకుముందు ఆమె జార్జి మేసన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.

views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams