Current Affairs Telugu Daily

కర్తార్‌పుర్‌ నడవాపై సానుకూల చర్చలు
పుల్వామా ఉగ్రదాడి తదనంతర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ అధికారుల తొలి భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. కర్తార్‌పుర్‌ నడవా అనుసంధానంపై విధివిధానాల ఖరారుకు గాను రెండు దేశాల అధికారులు మర్చి 14న భారత్‌ సరిహద్దుల్లో ఉన్న అటారీలో భేటీ అయ్యారు.
*పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌ పట్టణంలో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ నుంచి భారత్‌లోని  గుర్‌దాస్‌పుర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ గురుద్వారా వరకు నడవా అనుసంధానం కల్పించటంపై రెండు దేశాలు గత ఏడాది నవంబరులో ఓ అంగీకారానికి వచ్చాయి. దీనిని కార్యాచరణలోకి తీసుకురావటానికి సంబంధించి March 14 నాటి సమావేశంలో చర్చించారు. అనంతరం సంయుక్త ప్రకటన వెలువడింది.
*నడవా అమరికను ఖరారు చేయటానికి ఈ నెల 19న రెండు దేశాల సాంకేతిక నిపుణులు భేటీ అవుతారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 2న వాఘా(పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతం)లో తదుపరి చర్చలు జరుగుతాయని ఆ ప్రకటన వివరించింది. వీసాల్లేకుండానే రోజుకు 5000మంది భారతీయ యాత్రికులను కర్తార్‌పుర్‌లోని గురుద్వారాకు అనుమతించాలని భారతబృందం పాకిస్థాన్‌ను కోరింది.

views: 720



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams