Current Affairs Telugu Daily

వాయు కాలుష్యంపై పోరుకు 8 అత్యవసర బిల్లులు
దేశంలో ఓ పెను సామాజిక విపత్తుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రతిపాదించిన ఎనిమిది అత్యవసర బిల్లులకు దక్షిణ కొరియా పార్లమెంటు 13 March న ఆమోదముద్ర వేసింది.  పాఠశాలలు, డే కేర్‌ సెంటర్లలో గాలిని శుద్ధిచేసే పరికరాలను తప్పనిసరిగా అమర్చాలన్నది ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో ఒకటి. 
దక్షిణ కొరియాలో ధూళికణాల విపరీతంగా పెరిగిపోయి ఈ నెల 5న జనం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వెలుపలికి రావద్దని, ప్రజారవాణా వ్యవస్థనే వినియోగించమని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

views: 842



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams