Current Affairs Telugu Daily

ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహాన్ని కట్టడి చేయడానికి అత్యున్నత స్థాయి కమిటీ
ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఎన్నికల సంఘం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ‘ఎన్నికల నిఘాపై బహుళ శాఖల కమిటీ’ పేరుతో ఏర్పాటైన ఈ యంత్రాంగంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆర్థిక, భద్రతా సంస్థల అధికారులు సభ్యులుగా ఉంటారు.
*అక్రమ నగదుకు సంబంధించిన అంశాలపై ఈ కమిటీ నిశిత దృష్టి పెడుతుంది. అక్రమ నగదు మూలాలు, రవాణా, ఓటర్లకు పంపిణీపై కన్నేసి ఉంచుతుంది. ఈ కమిటీలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ పి.సి.మోదీ, పరోక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ ప్రణబ్‌ దాస్‌, కేంద్ర ఆర్థిక నిఘా బ్యూరో డీజీ మిటాలీ మధుస్మిత, ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ మిశ్ర, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీజీ దేవీప్రసాద్‌, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధిపతి పంకజ్‌ మిశ్ర, భారతీయ బ్యాంకింగ్‌ సంఘం ఛైర్మన్‌ సునీల్‌ మెహతా సభ్యులుగా ఉన్నారు.
*గత మూడు నెలల్లో అసాధారణ స్థాయిలో బ్యాంకుల్లో నగదు జమ అయితే వాటి తీరును విశ్లేషించడానికి బ్యాంకుల ప్రతినిధులకూ కమిటీలో చోటు కల్పించారు. వీరికితోడు సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ, పౌరవిమానయాన భద్రతా సంస్థ డీజీ తదితరులు కూడా సభ్యులుగా ఉన్నారు.

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams