Current Affairs Telugu Daily

బోయింగ్‌ 737 మాక్స్‌’లపై భారత్‌ నిషేధం
‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన జాబితాలో భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కూడా చేరాయి. ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్‌ తెలిపింది . మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 737 మాక్స్‌ విమానాలు ఎగరడానికి వీల్లేదని బ్రిటన్‌ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ఐరోపా సమాఖ్యకూడా తమ గగనతలంలో ఈ శ్రేణి విమానాలను నిషేధించింది.
*సింగపూర్‌, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాదేశాలూ  తాత్కాలికంగా విమానాశ్రయాలకే పరిమితం చేశాయి.
*బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన దేశాలు:  భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ

views: 669

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams