Current Affairs Telugu Daily

జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కరణ కింద శిక్షార్హుడే : సుప్రీం
వివాదాస్పద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ఎస్‌.కర్ణన్‌ అప్రియమైన వ్యవహారాలు, తీవ్రమైన చర్యలతో సంపూర్ణంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు తెలిపింది. అందు వల్ల ఆయన శిక్షకు అర్హుడేనని పేర్కొంది. ఆయన వ్యవహార శైలి, మాటలు న్యాయ వ్యవస్థను నవ్వుల పాల్జేశాయని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఇందుకు సంబంధించిన పూర్తి తీర్పును 2017 జులై 5న వెబ్‌సైట్‌లో పెట్టింది. 
ఈ వ్యవహారాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. 
ఇందులో 
    1. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌
    2. జస్టిస్‌ దీపక్‌ మిశ్ర
    3. జస్టిస్‌ జె.చలమేశ్వర్‌
    4. జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌
    5. జస్టిస్‌ ఎం.బి.లోకుర్‌
    6. జస్టిస్‌ పి.సి.ఘోష్‌
    7. జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌
అయిదుగురు న్యాయమూర్తుల తరఫున జస్టిస్‌ ఖేహర్‌ ప్రధాన తీర్పు రాశారు. 
జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ గొగొయ్‌లు రెండో తీర్పు రాశారు. 
ఇలాంటి కేసును న్యాయస్థానం తనకు తానుగా విచారణకు స్వీకరించడం దురదృష్టకరమైనదని జస్టిస్‌ ఖేహర్‌ అభిప్రాయపడ్డారు. 
ఈ ఉదంతంతో న్యాయమూర్తుల ఎంపిక తీరును పునః పరిశీలించవలసి ఉంటుందని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ గొగొయ్‌లు అభిప్రాయపడ్డారు. ఇరువురి తరఫున జస్టిస్‌ చలమేశ్వర్‌ తీర్పు రాశారు. 

views: 1086

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams