Current Affairs Telugu Daily

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గైడెడ్‌ రాకెట్‌ వ్యవస్థ పినాకను (March 11) భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ పరీక్ష జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది సైన్యంలోని శతఘ్ని విభాగం సత్తాను మరింత పెంచుతుందని వివరించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం సమకూరుతుందని పేర్కొంది. ఈ రాకెట్‌లో అధునాతన మార్గనిర్దేశ వ్యవస్థ ఉంది. దీనిని హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎంవీ రాజశేఖర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తాజా ప్రయోగానికి బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి నేతృత్వం వహించారు.
views: 760

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams